కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పరిశీలన చేస్తున్న పార్లమెంటు సంయుక్త కమిటీ (JPC) తన నివేదికను జూలై 17న ఆమోదించే అవకాశం ఉంది.

ఈ బిల్లులోని ప్రధాన ప్రతిపాదన ఏమిటంటే… ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రి తీవ్రమైన నేర ఆరోపణలపై 30 రోజులు వరుసగా జైలులో ఉంటే, 31వ రోజున వారి పదవి స్వయంచాలకంగా రద్దయ్యేలా నిబంధన ఉండొచ్చు. అయితే, ఈ చట్టాన్ని రాజకీయ కక్షసాధింపునకు వాడకుండా రక్షణ చర్యలు కూడా ఉండాలని కమిటీ సూచించే అవకాశం ఉంది. ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

30 రోజులు నిర్బంధంలో ఉంటే మంత్రి పదవి కోల్పోయేలా రాజ్యాంగ సవరణకు కేంద్రం ముందడుగు వేస్తుండగా… దుర్వినియోగం జరగకుండా రక్షణలు అవసరమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

#30 Days Jail Rule, #Central Government, #CM Disqualification, #Constitutional Amendment Bill, #JPC Report, #Minister Disqualification, #Parliament News