‘వందే మాతరం’ పాటలోని మొదటి రెండు చరణాలు మాత్రమే పాడితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ప్రముఖ నటి శర్మిలా ఠాగూర్ అభిప్రాయపడ్డారు. పాటలోని తరువాతి చరణాల్లో దుర్గ, కాళి వంటి హిందూ దేవతల ప్రస్తావన ఉండటంతో, ఒకే దేవుడిని నమ్మే ఇతర మతాల వారికి ఇబ్బందిగా అనిపించవచ్చని ఆమె చెప్పారు.
శర్మిలా ఠాగూర్ వ్యాఖ్యలపై నటి, ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. కళ, కవిత్వాన్ని కేవలం మతపరమైన కోణంలో చూడకూడదని ఆమె అన్నారు.
‘వందే మాతరం’లోని శక్తి అనే భావనను దేవతా ఆరాధనగా మాత్రమే చూడటం సరికాదని కంగనా పేర్కొన్నారు. కవి తన భావాన్ని చెప్పడానికి ఎన్నో రూపకాలను, ఊహలను ఉపయోగిస్తారని చెప్పారు.
బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘వందే మాతరం’ స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల్లో స్ఫూర్తి, శక్తిని నింపిన గీతం అని కంగనా అన్నారు. దాన్ని కేవలం మతపరమైన పాటగా పరిమితం చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, “హిందూ–ముస్లిం కోణంలో ఆలోచించడం నుంచి బయటకు రావాలి” అంటూ శర్మిలా ఠాగూర్‌కు కంగనా సూచించారు
