పాన్‌మసాలా ప్యాకెట్లలో ప్లాస్టిక్ వినియోగానికి ఇక చెక్ పెట్టింది భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI). కొత్త నిబంధనల ప్రకారం పాన్‌మసాలాను ప్యాక్ చేసేందుకు ప్లాస్టిక్ లేదా ప్లాస్టిక్‌తో కూడిన లామినేటెడ్ మెటీరియల్ ఉపయోగించకూడదు.
ఇక ఏ ప్యాకింగ్ వాడొచ్చు?
- ప్లాస్టిక్ లేని పేపర్
- పేపర్‌బోర్డ్
- సెల్యులోజ్ లేదా సహజ పదార్థాలతో తయారైన ప్యాకింగ్
- టిన్
- గ్లాస్ కంటైనర్లు
అయితే పేపర్ లేదా సహజ పదార్థాల పేరుతో కూడా పాలిథిన్, పాలీప్రొపైలిన్, పాలిస్టర్, PVC, ఇతర సింథటిక్ పాలిమర్లు, లామినేట్లు కలిపి ఉండకూడదు. అల్యూమినియం ఫాయిల్, మెటలైజ్డ్ లేయర్లు కూడా అనుమతించలేదు.
ఈ మార్పులను Food Safety and Standards (Packaging) Amendment Regulations, 2026లో భాగంగా గెజిట్‌లో నోటిఫై చేశారు. కొత్త నిబంధనలు పాన్‌మసాలా ప్యాకేజింగ్‌ను ప్లాస్టిక్ రహితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
సింపుల్‌గా చెప్పాలంటే:
ఇప్పటివరకు కనిపించే చిన్న చిన్న ప్లాస్టిక్ పాన్‌మసాలా సాచెట్లు ఇక ఉండకపోవచ్చు. కంపెనీలు ప్యాకింగ్ విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది.
