అమెరికా అధ్యక్షుడు Donald Trump మరోసారి ఇరాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. “వారికి చిన్న హెచ్చరిక ఇస్తున్నాను. ఈ రాత్రికే వారిపై తీవ్ర స్థాయిలో దాడులు చేయబోతున్నాం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా అడ్డుకోవాలనే లక్ష్యంతో అవసరమైతే అమెరికా మరిన్ని సైనిక చర్యలు చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ తమ చర్యలను మార్చుకోకపోతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
ట్రంప్ వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
