తెలంగాణ ఏర్పడిన సమయంలో రాష్ట్రంపై ఉన్న మొత్తం అప్పులు ₹90,161 కోట్లు మాత్రమేనని, బీఆర్ఎస్ పదేళ్ల పాలన ముగిసే నాటికి అవి ₹8.21 లక్షల కోట్లకు చేరాయని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ మొత్తంలో ప్రభుత్వ రుణాలతో పాటు, ప్రభుత్వ హామీతో తీసుకున్న కార్పొరేషన్ అప్పులు, పెండింగ్ బిల్లులు, విద్యుత్ సంస్థల బకాయిలు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. ఈ లెక్కలను బీఆర్ఎస్ ఖండించగలదా అని సవాల్ విసిరారు.
