బ్రిటన్ లో 40°Cకే రోడ్లు కరిగిపోతున్నాయి. కానీ temperature 45°C దాటినా భారత్‌లో ఎందుకు కరగవు?
- ఇది రోడ్ల నాణ్యతలో తేడా కాదు… అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా నిర్మాణం చేయడమే కారణం.
- బ్రిటన్‌లో తీవ్రమైన చలిని తట్టుకునేలా మృదువైన బిటుమెన్‌తో రోడ్లు నిర్మిస్తారు. అందువల్ల ఎండ ఎక్కువైతే అవి మెత్తబడి దెబ్బతింటాయి.
- భారత్‌లో మాత్రం తీవ్రమైన వేసవిని దృష్టిలో పెట్టుకుని గట్టి గ్రేడ్ బిటుమెన్, పెద్ద రాళ్ల మిశ్రమంతో రోడ్లు వేస్తారు. అందుకే 45°Cకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్నా రోడ్లు సాధారణంగా బలంగా ఉంటాయి.
- అంటే… ఏ దేశం రోడ్లు బలమైనవి అనే విషయం కాదు; ఆ దేశ వాతావరణానికి అనుగుణంగా వాటిని రూపొందించడం వల్లే ఈ తేడా కనిపిస్తోంది.
