ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులతో నాలుగు గంటలపాటు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
శాఖల మధ్య సమన్వయాన్ని పెంచి, అనవసర నిబంధనలను తగ్గించాలని ప్రధాని సూచించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా ప్రజలకు చేరేలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనకు వేగంగా సంస్కరణలు అమలు చేయాలని పిలుపునిచ్చారు.
