అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రెంట్ వీసా (శాశ్వత నివాస వీసా) దరఖాస్తుదారులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు అమెరికా రాయబార కార్యాలయాలు (Embassies) ఇ-మెయిల్స్‌ పంపుతున్నాయి.

అధికారిక కారణం – ప్రత్యేక శిక్షణ:

వీసా అధికారుల కోసం అమెరికా విదేశాంగ శాఖ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని (Global Training Initiative) ప్రారంభించింది. వీసా దరఖాస్తులను మరింత కఠినంగా, ఒకే పద్ధతిలో పరిశీలించేందుకే ఈ శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ సహాయంపై ఆధారపడేవారికి చెక్:

అమెరికా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేదా సహాయంపై ఆధారపడే అవకాశం ఉన్నవారిని ముందే గుర్తించి, వీసాలు తిరస్కరించడంపై ఈ శిక్షణలో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. అమెరికాలో అడుగుపెట్టేవారు స్వయం సమృద్ధిని కలిగి ఉండేలా చూడటమే ఈ నిబంధనల ఉద్దేశం.

వలసలపై ట్రంప్ కఠిన చర్యలు:

అక్రమ వలసలను అడ్డుకోవడంతోపాటు చట్టపరమైన ఇమ్మిగ్రెంట్ వీసాలు, గ్రీన్ కార్డ్‌ల జారీపై ట్రంప్ ప్రభుత్వం వరుసగా ఆంక్షలు విధిస్తోంది. దీనిలో భాగంగానే ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దరఖాస్తుదారులకు ఇబ్బందులు:

ఈ ఆకస్మిక వాయిదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూల కోసం వేల డాలర్లు ఖర్చు చేసి ప్రయాణాలకు సిద్ధమైన ఎంతోమంది దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త తేదీలు ఎప్పుడు ఇస్తారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.

#America Visa News, #Green Card Visa, #Immigrant Visa Delay, #Immigrant Visa Interview, #Trump Immigration Policy, #US Embassy Visa Interview, #US Immigrant Visa, #US Immigration News, #US Visa Interview Delay, #US Visa Interviews Suspended