అమెరికా- కెనడా దేశాల మధ్య రాజుకున్న వాణిజ్య వివాదం సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి దిగుమతి సుంకాలు విధించుకుంటున్న నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో టాయిలెట్ పేపర్ సహా పలు నిత్యం ఉపయోగించే పేపర్ ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటనున్నాయి.

భారీగా పెరగనున్న ధరలు:

అమెరికాలో తయారయ్యే టాయిలెట్ పేపర్లు, టిష్యూలకు అవసరమైన ముడిసరుకు చాలావరకు కెనడా నుంచి దిగుమతి అవుతుంది. తాజాగా ఈ దిగుమతులపై భారీగా పన్నులు విధించడంతో..ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి.

కెనడా ప్రతికార చర్యలు:

అమెరికా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కెనడా కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 8 నుంచి అమెరికాకు చెందిన సుమారు 700కి పైగా ఉత్పత్తులపై 25% నుంచి 50% వరకు అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది.

సామాన్యులపై భారం:

ఈ ట్రేడ్ వార్ (Trade War) కారణంగా ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న వినియోగదారులపై మరింత ఆర్థిక భారం పడనుంది.

ఈ వాణిజ్య ఉద్రిక్తతలు ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా సామాన్య ప్రజల నిత్య జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#America Canada Trade War, #Canada Tariffs, #Paper Products Price Hike, #Tissue Paper Prices, #Toilet Paper Price Hike, #Toilet Paper Prices, #Trade War Impact, #US Canada Tariffs, #US Canada Trade War, #US Tariffs