తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో అధికారికంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ కేసును కోర్టు ముగిసినట్లు ప్రకటించింది.

సంగీత ఈ ఏడాది ప్రారంభంలో విజయ్‌తో తన దాదాపు 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం ఈ కేసు పలుమార్లు విచారణకు వచ్చినప్పటికీ, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ వ్యవహారం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది.

ఆగస్టు 7న జరిగిన విచారణ సందర్భంగా సంగీత తన పిటిషన్‌ను స్వచ్ఛందంగా ఉపసంహరించుకోవాలని కోర్టును కోరారు. ఆమె అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇస్తూ కేసును ముగిసినట్లు ప్రకటించింది. దీంతో విజయ్–సంగీత విడాకుల వ్యవహారానికి ప్రస్తుతం తెరపడింది.

అయితే పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి గల కారణాలపై విజయ్ లేదా సంగీత ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఈ పరిణామం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్ది నెలలుగా విజయ్ వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలవగా, తాజా నిర్ణయంతో ఆ చర్చలకు తాత్కాలికంగా ముగింపు పలికినట్లైంది.

#Sangeetha Divorce Petition, #Sangeetha Vijay, #Tamil Nadu CM Vijay, #TVK Vijay, #Vijay, #Vijay Divorce, #Vijay Family, #Vijay Wife