ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు కృత్రిమ మేధస్సు (AI)పై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు ఉద్యోగులు AIని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తున్నారో కూడా కంపెనీలు కొలవడం ప్రారంభించాయి.
కొన్ని కంపెనీల్లో ఉద్యోగులు ఉపయోగించిన AI టోకెన్ల (AI సేవల వినియోగాన్ని కొలిచే యూనిట్) ఆధారంగా అంతర్గత ర్యాంకింగ్ వ్యవస్థలు కూడా రూపొందించారు. ఎక్కువ AI వినియోగించిన ఉద్యోగులు ఎవరు అనే విషయంలో ఉద్యోగుల మధ్య పోటీ నెలకొంది. అయితే ఈ డేటా బయటకు వెళ్లే అవకాశం ఉందన్న ఆందోళనలతో అలాంటి డ్యాష్బోర్డులను కొన్ని సంస్థలు నిలిపివేశాయి. (The Times of India)
ఇప్పుడు పరిస్థితి మరో మలుపు తిరిగింది. AI వినియోగం విపరీతంగా పెరగడంతో కంపెనీల ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఉద్యోగులు అవసరమైన మేరకే AIను వినియోగించాలని, టోకెన్ల వినియోగంపై పరిమితులు విధించాలని పలు టెక్ సంస్థలు నిర్ణయిస్తున్నాయి. (The Information)
ఇదంతా చూస్తే, ఒకప్పుడు ఉద్యోగుల పనితీరును గంటలు, ప్రాజెక్టులు, లక్ష్యాలతో కొలిచిన సంస్థలు… ఇప్పుడు AIను ఎంత సమర్థంగా ఉపయోగిస్తున్నారన్నదే కొత్త ప్రమాణంగా మారుతోంది. AI వినియోగం ఉద్యోగుల పనితీరులో కీలక భాగంగా మారడం, అదే సమయంలో దాని ఖర్చులను నియంత్రించడం… టెక్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న కొత్త ధోరణిగా నిపుణులు భావిస్తున్నారు.
