జూలై 1 నుంచి సామాన్యుల జీవితంపై ప్రభావం చూపే ముఖ్యమైన మార్పులు ఇవే:
1 ఆదాయపు పన్ను (ITR)
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ITR దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ. గడువు దాటితే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది.
2 ఆధార్‌లో ఈ-మెయిల్ అప్డేట్
ఇప్పటివరకు ఈ సేవకు రూ.75 ఫీజు ఉండేది. కానీ జూలై 1 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈ-మెయిల్ అప్డేట్ పూర్తిగా ఉచితం.
3 పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు
కొత్త పాస్‌పోర్ట్, రెన్యువల్, తత్కాల్ సేవలకు ప్రభుత్వం ఫీజులను పెంచింది. దీంతో ఇకపై పాస్‌పోర్ట్ కోసం గతం కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
4 EPFO సేవలు
EPFO డిజిటల్ సేవల్లో మార్పులు తీసుకొస్తున్నారు. దీంతో పీఎఫ్‌కు సంబంధించిన సేవలు మరింత సులభంగా, వేగంగా అందించడమే లక్ష్యం.
5 క్రెడిట్ కార్డ్ నిబంధనలు
కొన్ని బ్యాంకులు, ముఖ్యంగా SBI, HDFC క్రెడిట్ కార్డుల రివార్డ్స్, ఎయిర్పోర్ట్ లాంజ్ వంటి ప్రయోజనాల్లో మార్పులు చేశాయి. కార్డు వినియోగదారులు తమ బ్యాంకు కొత్త నిబంధనలు తెలుసుకోవడం మంచిది.
6 RBI కొత్త రక్షణ నిబంధనలు
బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వినియోగదారులకు తప్పుడు ఆర్థిక ఉత్పత్తులను బలవంతంగా విక్రయించకుండా ఉండేందుకు RBI కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.
