ఇజ్రాయెల్‌కు అమెరికానే ఏకైక శక్తివంతమైన మిత్రదేశమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ప్రధాని Benjamin Netanyahu స్పందించారు.

నెతన్యాహు మాట్లాడుతూ, “అమెరికా మా అత్యంత ముఖ్యమైన మిత్రదేశం అన్నది నిజమే. కానీ అమెరికా ఒక్కటే కాదు. భారత్ వంటి మరికొన్ని బలమైన మిత్రదేశాలు కూడా మాకు ఉన్నాయి” అని స్పష్టం చేశారు.

జేడీ వాన్స్ ఇటీవల మాట్లాడుతూ, “ప్రస్తుతం ప్రపంచంలో ఇజ్రాయెల్‌కు అమెరికానే ఏకైక శక్తివంతమైన మిత్రదేశం” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెతన్యాహు, భారత్‌తో పాటు ఇతర దేశాలతో కూడా ఇజ్రాయెల్‌కు బలమైన స్నేహపూర్వక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు.

నెతన్యాహు భారత్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడం, భారత్–ఇజ్రాయెల్ మధ్య రక్షణ, భద్రత, సాంకేతికత, వాణిజ్య రంగాల్లో పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

#Benjamin Netanyahu, #India Foreign Policy, #India Israel, #Israel India Relations, #Israel US Relations, #JD Vance, #JD Vance News, #Netanyahu Statement, #Strategic Partnership