భారతదేశ గొప్ప శాస్త్రవేత్తల జ్ఞాపకాలను ప్రపంచానికి చాటే అద్భుత కళాఖండం ఇప్పుడు అంతరిక్ష యాత్రకు సిద్ధమైంది.
వరంగల్‌కు చెందిన అంతర్జాతీయ సూక్ష్మ శిల్పకారుడు అజయ్ కుమార్ మట్టెవాడ, సూది కన్నులో భారత దిగ్గజ శాస్త్రవేత్తలు సర్ సి.వి. రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయి, డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం సూక్ష్మ శిల్పాలను అద్భుతంగా చెక్కారు.
ఈ అరుదైన కళాఖండం హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణించనుంది.
మానవ కంటికి కనిపించడమే కష్టమైన సూది కన్నులో ఇంత సూక్ష్మంగా శిల్పాలు చెక్కడం ఎంతో క్లిష్టమైన కళ. దీనికి గంటల తరబడి ఏకాగ్రత, అపారమైన ఓర్పు, అసాధారణ ప్రతిభ అవసరం.
ఈ కళాఖండాన్ని అంతరిక్షంలోకి పంపడం ద్వారా భారత శాస్త్రవేత్తలకు వినూత్నంగా నివాళి అర్పించడంతో పాటు, భారత కళా ప్రతిభను ప్రపంచానికి చాటే మరో అరుదైన ఘట్టంగా నిలవనుంది.
సూది కన్నులో సృష్టించిన కళ… ఇప్పుడు నింగిని తాకబోతోంది. భారత శాస్త్రవేత్తల వారసత్వం అంతరిక్షంలోనూ చిరస్థాయిగా నిలవబోతోంది.
