ఒక చెట్టు కూలింది… కానీ ఒక కుటుంబం మొత్తం కుప్పకూలిపోయింది.
ముంబైలోని చెంబూర్‌లో జరిగిన హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. భారీ చెట్టు స్కూల్ బస్సుపై కూలిపోవడంతో 11 ఏళ్ల విహాన్ శ్రీవాస్తవ్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.
ప్రతిరోజూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక క్రికెట్ ఆడటం విహాన్‌కు ఎంతో ఇష్టం. ఆ రోజు కూడా “వాడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లాలి…” అని తల్లి అతని బ్యాట్‌ను గుండెలకు హత్తుకుని విలపిస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.
కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబుతున్నట్లుగా విహాన్ చాలా తెలివైన, క్రమశిక్షణ గల బాలుడు. ఒకరోజు గొప్ప క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. కానీ ప్రకృతి విపత్తు ఆ చిన్నారి జీవితాన్ని అర్థాంతరంగా ముగించింది.
